అర్జున్ సమాచారం ప్రతినిధి, ఆగస్టు 7,
కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గెళ్ళ చంద్ర మొగిలికి చెందిన గుడిసె పూర్తిగా తడిసి కూలి నేలమట్టమైంది. గుడిసె కూలిన
సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ, అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ
మండల యువ నాయకులు వేముగంటి శ్రావణ్ రెడ్డి, 4వ వార్డు సభ్యులు వేముగంటి మల్లారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ విషయాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా
కృషి చేస్తామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.